రేపు విశాఖకు వైఎస్ జగన్… ప్రమాద బాధితులకు పరామర్శ

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన బాధితులను బుదవారం మాజీసీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి ఆయన బయలుదేరనున్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ వ్యక్తిగతంగా కలవనున్నారు. స్టీల్ ప్లాంట్ పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను కలిసి, వారికి అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీయనున్నారు. పారిశ్రామిక భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై, యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేయనున్నారు. మృతుల కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన కార్మికులకు ప్రభుత్వం తరఫున భారీగా ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేసే అవకాశం ఉంది.

Latest Articles

పవర్ స్టార్.. ఇక సినిమాలు చేయరా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌.. ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన తర్వాత.. నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు కానీ.. ఇంత వరుకు పట్టాలెక్కలేదు. అలాగే ఓజీ సీక్వెల్ ఉందని హింట్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్