వారణాసి అదిరిపోయే అప్ డేట్..?

వారణాసి.. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాదు.. సినీ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడు ఈ క్రేజీ మూవీ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జక్కన్న ఏమో.. ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా.. సైలెంటుగా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్.. లేటెస్ట్ గా వారణాసి గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన అప్ డేట్ తో.. వారణాసి పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఇంతకీ.. విజయేంద్రప్రసాద్ వారణాసి గురించి ఏం చెప్పారు..?

దర్శకధీరుడు రాజమౌళి.. అనౌన్స్ చేసిన డేట్ కి వారణాసి సినిమాని రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తో వర్క్ చేస్తున్నారు. జక్కన్న ఈ సినిమా రిలీజ్ కి సంవత్సరం ముందు నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేయడం విశేషం. ముఖ్యంగా విదేశాల్లో వారణాసి సినిమా పై క్రేజ్ క్రియేట్ చేయడం కోసం చాలా కసరత్తు చేసారు జక్కన్న. అయితే.. ఈ మూవీ గురించి ఎలాంటి లీకులు లేకుండా చాలా కేర్ తీసుకుంటున్నాడు. అయినప్పటికీ.. ఏదోటి లీక్ అవుతూనే ఉంది. ఈ క్రేజీ మూవీలో ప్రేక్ష‌కుల‌కు పూన‌కాలు తెప్పించే ఎపిసోడ్లు చాలానే ఉంటాయ‌నే టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇందులో మ‌హేష్ బాబు రాముడిగా క‌నిపించనున్నాడు అని తెలిసినప్పటి నుంచి ఆయన గెటప్ ఎలా ఉంటుంది..? ఈ సినిమా కథకు ఆ ఎపిసోడ్ ను ఎలా లింక్ చేసి చూపిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఈవెంట్లో రైటర్ విజయేంద్రప్రసాద్ వారణాసిలో త్రేతాయుగం ఎపిసోడ్ గురించి గూస్ బంప్స్ ఇచ్చే మాట‌లు చెప్పారు. వార‌ణాసి గ్లింప్స్‌లో క‌నిపించిన రాముడు, కుంభ‌క‌ర్ణుడి పాత్ర‌ల గురించి ప్ర‌స్తావిస్తూ.. సినిమాలో ఈ ఇద్ద‌రి మ‌ధ్య యుద్ధాన్ని చూపిస్తామ‌ని ఆయ‌న తెలియచేశారు. గ్లింప్స్‌లో రాముడిని, కుంభ‌కర్ణుడిని, ఆంజ‌నేయుడిని… త‌న తోకను మీరు చూశారు క‌దా అని చెబుతూ.. ఈ ఎపిసోడ్ చూసి అంద‌రూ స్పెల్ బౌండ్ అయిపోతార‌ని విజ‌యేంద్ర చెప్పారు.

లెజెండ‌రీ రైట‌ర్ విజయేంద్రప్రసాద్.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో ముఖ్యమైన ఘట్టాలు గురించి గతంలో చెప్పిన మాటలు నిజం అయ్యాయి. వార‌ణాసిలో రాముడికి, కుంభ‌క‌ర్ణుడికి మ‌ధ్య వ‌చ్చే యుద్ధ స‌న్నివేశాల‌ను రాజ‌మౌళి అద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన చెప్పడంతో… మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ఒక్క‌టి క్లిక్ అయిందంటే వారణాసి వేరే లెవెల్లో ఉంటుందని.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది. మరి.. వారణాసి టాలీవుడ్, బాలీవుడ్లోనే కాకుండా.. హాలీవుడ్లో కూడా చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.

Latest Articles

కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్