పేట్‌బషీరాబాద్ పోక్సో కేసులో తండ్రి-కొడుకులకు జీవిత ఖైదు విధించింది కోర్టు. 2023లో నమోదైన పోక్సో కేసులో నిందితులు శివకుమార్, అతని కుమారుడు శామ్యూల్‌కు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా కూడా విధించింది. బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2023 ఆగస్టు 10న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూలీ పనికి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి 7 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు. బాలికను పొరుగింటి శివకుమార్, అతని కుమారుడు తమ ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక వెల్లడించింది. తల్లిదండ్రులు ప్రశ్నించగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా 2023 ఆగస్టు 12న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. చార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం కేసుపై పూర్తి విచారణ జరిగింది. మేడ్చల్‌లోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ పోక్సో కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. డీసీపీ క్రైమ్స్ ఎ. ముత్యం రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.
పేట్‌బషీరాబాద్ పోక్సో కేసులో తండ్రీకొడుకులకు జీవిత ఖైదు
0
70
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


