కాకినాడ కలెక్టరేట్‌లో కలకలం రేగింది. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు చేశారు.
కలెక్టరేట్ రికార్డు రూమ్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివకుమార్ లక్ష్యంగా సోదాలు చేస్తున్నారు. శివకుమార్ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతోనే ఏసీబీ రంగంలోకి దిగింది. శివకుమార్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి . శివకుమార్ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు సోదాలు చేస్తున్నారు.
కాకినాడ కలెక్టరేట్‌లో ఏసీబీ సోదాలు
Latest Articles
- Advertisement -


