ఇరకాటంలో డీకే ప్రభుత్వం… కొత్త మంత్రి రాజీనామా

బుధవారం కొత్త ముఖ్యమంత్రితో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం తన రాజీనామా లేఖను పంపించారు. కర్ణాటకలో కొలువుదీరిన డీకే శివకుమార్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ ప్రమాణ స్వీకారం జరిగిన రెండు రోజుల్లోనే మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తనకు కేటాయించిన శాఖలపై రామలింగారెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. బెంగళూరు నగర అభివృద్ధి శాఖను ఆశించిన రామలింగారెడ్డికి ,…డీకే శివకుమార్‌ ఇరిగేషన్‌ శాఖను కేటాయించారు. సిద్ధరామలింగయ్య కేబినెట్‌లో ఆయన రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు.

తాను పదవులను ఆశించలేదని.. సిద్ధరామయ్య, డీకే కేబినెట్‌లో పదవులను కోరుకోలేదని రామలింగారెడ్డి అన్నారు. బెంగళూరు నగర అభివృద్ధిశాఖ ఇస్తామని..సీఎం డీకే శివకుమార్‌ హామీ ఇచ్చారని చెప్పారు. తనకు ఇదే శాఖ కావాలని డిమాండ్‌ చేయలేదని చెప్పారు. ఇచ్చిన మాట తప్పినందుకే రాజీనామా చేశానని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారు రామలింగారెడ్డి.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్