మూడు రోజుల కిందట కొలువుదీరిన కర్ణాటక ప్రభుత్వం అంతర్గత రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రులలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేయగా.. మరొక మంత్రి తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మరో సీనియర్ నాయకుడు తనను పక్కన పెట్టారనే కారణంతో అసహనంగా ఉన్నారని సమాచారం. అదే సమయంలో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. మంత్రి రామలింగారెడ్డి తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తితో రాజీనామా చేశారు. మరో మంత్రి కేహెచ్ మునియప్ప కూడా తనకు ఇచ్చిన మంత్రిత్వ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇలా అసంతృప్తులు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే డీకేకు తలనొప్పులు
0
81
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


