మాజీ ప్రియురాలిని ఓ ప్రేమోన్మాది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన పంజాబ్‌లోని మొహాలిలో జరిగింది. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న డింపుల్ అనే మహిళను ఆమె మాజీ ప్రియుడు అతి దారుణంగా 20 సార్ల కంటే ఎక్కువ కత్తితో పొడిచి హత్య చేశాడు. హర్వీందర్, డింపుల్ మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. తర్వాత కూడా తమ బంధాన్ని కొనసాగించాలని హర్వీందర్ కోరాడు., దానికి డింపుల్ నో చెప్పింది. దీంతో పగ పెంచుకున్న హర్వీందర్.. ఆఫీసులోనే డింపుల్‌ను కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హర్వీందర్‌ను తోటి ఉద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. డింపుల్‌ను కత్తితో పొడిచిన తర్వాత తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డింపుల్ మృతి చెందగా.. హర్విందర్ చికత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పంజాబ్‌లో దారుణం.. ప్రియురాలిని 20సార్లు కత్తితో పొడిచి హత్య
0
87
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


