సంస్కరణలు, విజన్ పాలిటిక్స్‌కి టీడీపీ ఆదర్శమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ ఆవిర్భావం, ప్రస్థానం అన్నీ సంచలనమే అని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఇంత ప్రభావం చూపించిన మరో పార్టీ లేదన్నారు. జాతీయ జెండా దేశానికి గర్వకారణమని.. పసుపు జెండా తెలుగువాళ్ల ఆత్మగౌరవమని చెప్పారు. ఈ మహానాడు మహిళలకు అంకితమని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సాధించి.. మహిళలను చట్టసభలకు పంపిస్తామని చంద్రబాబు అన్నారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. హైబ్రిడ్ విధానంలో రెండు రోజులపాటు మహానాడు నిర్వహిస్తున్నారు. టీడీపీ మహానాడులో 20 తీర్మానాలపై చర్చలు జరపనున్నారు. స్త్రీశక్తి థీమ్‌తో టీడీపీ మహానాడు ఈ ఏడాది నిర్వహిస్తోంది. 1,875 క్లస్టర్లలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. క్లస్టర్ల వారీగా మహానాడులో టీడీపీ శ్రేణులు పాల్గొననున్నారు.
సంస్కరణలు, విజన్ పాలిటిక్స్‌కి టీడీపీ ఆదర్శం- చంద్రబాబు
0
7
Previous article
Latest Articles
2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేశ్
మహానాడులో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని ఆయన కోరారు. పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ కాకపోయినా.. వచ్చే...
- Advertisement -
- Advertisement -


