వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కల్లాల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తైన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలని చెప్పారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన రేవంత్ రెడ్డి
0
68
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


