ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో రోజు పర్యటనలో భాగంగా భువనగిరి మార్కెట్‌ను పరిశీలించారు నేతలు. ఐకేపీ సెంటర్‌కి పంట తెచ్చి 40 రోజులైనా ఇప్పటికీ కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం ట్రాన్స్‌పోర్టుకి లారీలు కూడా లేవంటున్నారు. రోజుల తరబడి మార్కెట్‌లోనే పడిగాపులు పడుతున్నామని రైతులు వివరించారు. తడిచిన ధాన్యాన్ని బీజేపీ నేతలకు చూపించారు. కొనుగోళ్లలో తమకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని అన్నారు. తేమ శాతం పేరుతో ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆరోపించారు. బస్తాలు కుట్టే సుతిలీ దారం కూడా తామే కొంటున్నామని రైతులు బీజేపీ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం
0
4
Latest Articles
ప్రేమను తిరస్కరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబ్
తన ప్రేమను తిరస్కరించిందని ఓ యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి దిగాడు ఓ యువకుడు. కోయంబత్తూరులోని తొండముత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై తన స్నేహితుడితో కలిసి వచ్చిన యువకుడు.....
- Advertisement -
- Advertisement -


