హైదరాబాద్ కూకట్పల్లి ఏబీవీపురంలో భూదాన్ భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన నిరసనకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంఘీభావం ప్రకటించారు. ఆచార్య వినోభా భావే చేపట్టిన భూదాన్ ఉద్యమంలో భాగంగా నిరుపేదలకు ఒక్కో కుటుంబానికి 60 నుంచి 70 గజాల చొప్పున సుమారు 850 కుటుంబాలకు స్థలాలు పంపిణీ చేసిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. ఈ భూములపై ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న పేదలకు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూముల సమస్యను మానవీయ దృక్పథంతో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు.
భూదాన్ భూముల సమస్యను పరిష్కరించాలి- ఈటల
0
7
Previous article
Next article
Latest Articles
బీఆర్ఎస్వీ నేతలపై కేసు నమోదు
జీవో నంబర్ 7 రద్దు చేయాలని, పదివేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఇటీవల సెక్రటేరియట్ ముట్టడించిన బిఆర్ఎస్వీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా...
- Advertisement -
- Advertisement -


