ప్యాకేజి ప్రకటించాక స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తి పెరిగింది- భూపతి రాజు శ్రీనివాస వర్మ

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.11 వేల 400 కోట్ల ప్యాకేజీని అమలు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం జిల్లా బిజెపి కార్యాలయంలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్యాకేజీ ప్రకటించాక ఉత్పత్తి పెరిగిందని, 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నామన్నారు.

అంతేకాకుండా మార్చి 31 నాటికి వీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటివరకు వీఆర్‌ఎస్‌కు 1,141 మందిని అర్హులుగా నిర్ణయించడం జరిగిందన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. మిగిలిన వారికోసం కమిటీ ఏర్పాటు చేశామని, రేపటిలోగా మొదటి విడతగా 200 మందికి వీఆర్‌ఎస్‌ను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.

జాతీయ రహదారి 165 విస్తరణలో భాగంగా ఆకివీడు నుండి దిగమర్రు బైపాస్ రోడ్డు వరకు ఎలైన్‌మెంట్‌ రూపొందించడం జరిగిందన్నారు. సుమారు 580 నుండి 590 ఎకరాల వరకు భూ సేకరణ చేయడానికి ఇప్పటికే రూ.1200 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. ఒక్క ఇల్లు కూడా తొలగించకుండా నూతన అలైన్‌మెంట్‌ ప్రకారం జాతీయ రహదారిని నిర్మిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్