26.2 C
Hyderabad
Saturday, February 7, 2026
spot_img

మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్‌కు మంత్రి కొండా సురేఖ లేఖ

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలకు సోనియా, రాహుల్ గాంధీలకు మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో బీసీ కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిందని స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా శ్రమించారని తెలిపారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని బీసీలకు మరింత న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేష‌న్‌లో పేర్కొన్న మేరకు ఈ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. ఈ మొత్తం బీసీ సర్వే ప్రక్రియలో పార్టీ, ప్రభుత్వపరంగా కాంగ్రెస్ అధినాయకత్వం చాలా సహకరించిందని అన్నారు.. అందుకు కృషి చేసిన ఏఐసీసీ అగ్రనేతలకు మంత్రి కొండా సురేఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్