డోంట్‌ బి అడిక్టెడ్.. ముగ్గుతో జనసేన వీర మహిళ సందేశం

సంక్రాంతి అంటేనే సరదాల పండుగ. రైతుల పండుగ. ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్చెమ్మలు, డూడూ బసవన్నలు.. ఇలా సందడిగా జరుపుకుంటున్నారు. గ్రామాల్లో అయితే పెద్ద పెద్ద ముగ్గులు వేసి మహిళలు పోటీ పడుతుంటారు. ఎవరి ముగ్గు పెద్దది.. ఎవరి ముగ్గు కలర్‌ ఫుల్‌గా ఉంది..ఇలా పోటీ పడి మరీ ముగ్గులు వేస్తుంటారు. భోగి రోజు భోగి కుండలు, సంక్రాంతి పండుగ రోజు పీటల ముగ్గు, కనుమ రోజు రథం ముగ్గు వేస్తుంటారు. సంక్రాంతి పండుగకు ముగ్గులోనే శుభాకాంక్షలు చెబుతారు. కానీ ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా రంగవల్లికను తీర్చిదిద్దింది. ఇందులో సందేశం కూడా ఇచ్చింది. అంతేకాదు సోషల్‌ మీడియాలో ఉండే నెటిజన్లకు ఓ వార్నింగ్‌ కూడా ఇచ్చింది.

నందికొట్కూరు సాయిబాబా పేటకు చెందిన అనుష అనే జనసేన వీర మహిళ ఆమె ఇంటి ముందు సందేశాత్మకమైన ముగ్గును వేసింది. భోగి పండుగ సందర్శంగా జనసేన జెండాతో పాటు సోషల్ మీడియా బోమ్మలతో ముగ్గును తీర్చిదిద్దింది. యువత సోషల్‌ మీడియాకు బానిస కాకూడదంటూ డోంట్ అడిక్ట్‌ అంటూ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇంస్టాగ్రామ్‌లలో వచ్చే లింకులను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని ముగ్గుతో సందేశమిచ్చారు. సందేశాత్మక ముగ్గు వేయడంతో జనసేన వీర మహిళ అనుషను కాలనీ వాసులు అభినందిస్తున్నారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్