27.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

‘యావరేజ్ స్టూడెంట్ నాని’ నుంచి మాస్ సాంగ్ రిలీజ్

మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా పవన్ కుమార్ కొత్తూరి సక్సెస్ అందుకున్నారు. డైరెక్టర్‌గా సక్సెస్ అయిన పవన్ కుమార్.. ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. రెండో ప్రాజెక్టుతో ఆయన హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది.

ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. వరుసగా కంటెంట్‌ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే పాటలు, టీజర్, పోస్టర్ అంటూ బజ్ క్రియేట్ చేశారు. తాజాగా మంచి మాస్ అండ్ ఎనర్జిటిక్ బీట్ ఉన్న పాటను విడుదల చేశారు.

రాలే పువ్వే అంటూ అదిరిపోయే పాటను తాజాగా రిలీజ్ చేశారు. కార్తీక్ బి కొడకండ్ల అందించిన క్యాచీ ట్యూన్‌.. భువనేశ్వర్ రాగిఫణి సాహిత్యం.. లక్ష్మీ శ్రావణి, కార్తీక్ బి కొడకండ్ల గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. రాజ్ పైడి మాస్టర్ స్టెప్పులు కుర్రకారును కట్టిపడేసేలా ఉన్నాయి. హీరోయిన్లు స్నేహా, సాహిబా అందాలకు కుర్రకారు ఫిదా అవ్వడం గ్యారెంటీ. ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఉద్ధవ్ ఎస్ బి ఈ సినిమాకి ఎడిటర్.

నటీనటులు: పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాల్వియ, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్ హౌస్: శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ LLP
నిర్మాతలు: పవన్ కుమార్ కొత్తూరి, బిషాలి గోయెల్
రచయిత, దర్శకుడు: పవన్ కుమార్ కొత్తూరి
సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల
DOP: సజీష్ రాజేంద్రన్
ఎడిటర్: ఉద్ధవ్ SB
పాటల కొరియోగ్రఫీ: రాజ్ పైడి మాస్టర్
ఫైట్స్: నందు
PRO: SR ప్రమోషన్స్ (సాయి సతీష్)

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్