మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్‌కు ప్రజలు పోటెత్తుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న ప్రజల సమస్యలను, కష్టాలను ఓపిగ్గా వింటున్న లోకేశ్.. వారి కన్నీళ్లు తుడుస్తూ తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో లోకేశ్ ప్రతి ఒక్కరినీ స్వయంగా కలుస్తూ వినతులు స్వీకరించారు. వారి సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం ఆయా శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.