ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నారు. గాంధీ జయంతి రోజున ‘జన్ సురాజ్’ పార్టీని స్థాపించనున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ‘జన్ సురాజ్’ పేరుతో క్యాంపెయిన్ నడుపుతున్న ప్రశాంత్ కిషోర్ అదే పేరును రాజకీయ పార్టీకి పెట్టనున్నట్లు నిన్న పట్నాలో నిర్వహించిన జన్ సురాజ్ వర్క్‌షాప్‌లో తెలిపారు. కొత్త పార్టీకి ఎవరూ మార్గదర్శకం వహిస్తారనేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. మెరుగైన విద్యా, వైద్యం, బిహార్ భవిష్యత్తు కోసం శ్రమించాలని కార్యకర్తలకు ప్రశాంత్ కిషోర్ దిశానిర్దేశం చేశారు. రెండేళ్ల క్రితం బిహార్‌లో జన్ సురాజ్ యాత్రను ప్రశాంత్ కిశోర్ ప్రారంభించారు. ప్రశాంత్ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ, జేడీ(యూ) కూటమి ప్రభుత్వాన్ని ఢీ కొడతారా, లేక ఆర్జేడీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.
కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్న ప్రశాంత్ కిషోర్
0
323
Latest Articles
breaking : పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్
చెరువులను కబ్జా చేశానని అంటున్నారు
నిజంగా చెరువులను కబ్జా చేస్తే నా ఇల్లు తగలబెట్టేయరా? ఉంచుతారా? రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టం.. ఆయనంటే గౌరవం నేను చెరువును కబ్జా చేసి ఉంటే ఆ చెరువును నేను...
- Advertisement -
- Advertisement -


