ఉచిత ఇసుక విధానం ప్రారంభం

2024 ఎన్నికల్లో అధికారం చేపట్టిన తరువాత ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కో హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చడం ప్రారంభించింది. ఇప్పటికే పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందించింది. మెగా డీఎస్సీ ప్రకటించింది. తాజాగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీ విధానాలను రద్దు చేస్తూ ప్రజలకు ఉచిత ఇసుక అందిస్తూ చర్యలు చేపట్టింది. ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు అమలవుతాయని పేర్కొంది.

మరోవైపు ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తిదేనని కొట్టిపారేస్తున్నారు. స్టాక్ యార్డు వద్ద ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టిందన్నారు. దీన్ని ఉచిత ఇసుక అంటారా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రీచ్‌ల దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరి దగ్గర ఉంచుతుందని నిలదీస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఉసులుమర్రులో నిల్వ ఉన్న ఇసుక రీచ్‌లను నేడు పెరవలి మండల ఎమ్మార్వో ప్రారంభించారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా పోలీసు బందోబస్తు నడుమ ఉచిత ఇసుక కేంద్రాన్ని మొదలుపెట్టారు. ఉసులుమర్రు గ్రామంలో 600 పైగానే కార్మికులుం ఉంటామని…ఈ ర్యాంపుకు సంబంధించి లోడింగ్ విషయంలో తమ అందరికీ న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్