మహిళలపై సీఎంకు గౌరవం ఉంటే బెల్ట్‌ షాపులు మూయించాలి – కిషన్‌ రెడ్డి

ఇందిరా గాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ వద్ద భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదేనన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేని అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు. మహిళలకు ప్రతి నెల 2 వేల 500 ఇస్తామన్న రేవంత్‌ ప్రభుత్వం.. వారికి 20 వేల రూపాయలు బాకీ ఉందని తెలిపారు. వృద్ధులకు 4 వేల పింఛన్‌ ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్‌ గాంధీ పర్యటనల కోసం పన్నులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. పథకాల పేరుతో తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన కిషన్‌ రెడ్డి మహిళలపై సీఎంకు గౌరవం ఉంటే బెల్ట్‌ షాపులు మూయించాలని డిమాండ్‌ చేశారు.

Latest Articles

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్