ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు కొత్త సమీకరణా లకు కారణమవుతున్నది. సీట్లు దక్కని అసంతృప్త నేతలు పార్టీ వీడతున్నారు. తాజాగా జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రమేశ్ రెడ్డి సీఎం జగన్ సమక్షంలో బుధవారం వైసీపీలో చేరారు. వీరికి సీఎం జగన్ పార్టీ జెండా కప్పి వైఎస్సార్ సీపీలోకి సాదరంగా ఆహ్వా నించారు. విజయవాడ వెస్ట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ రెండు రోజుల క్రితం జనసేన పార్టీకి గుడ్ చెప్పారు. ఈ సందర్భం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు దక్కలేదని పోతిన మనస్తాపానికి గురై రాజీనామా చేసారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం మహేష్ చివరి వరకు ప్రయత్నించారు. కానీ, పొత్తులో భాగంగా సీటు బీజేపీకి దక్కింది. అక్కడ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. దీంతో మహేష్ తన అనుచరులతో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు
0
253
Previous article
Next article
Latest Articles
బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ
పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -
- Advertisement -


