వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారని ఖమ్మం మార్కెట్‌లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ ప్రధాన గేటు ముందు బైఠా యించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అక్కడికి చేరుకుని రైతు లతో మాట్లాడారు. అయినా రైతులు శాంతించ కుండా గిట్టుబాటు ధర కల్పించాలని.. అప్పటి వరకు కొనుగోళ్లు నిలిపివేయాలని, గేట్లు మూసివేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్‌లో ప్రస్తుతం మిర్చి కొను గోళ్లు నిలిచిపోయాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జెండా పాట ధర క్వింటాల్‌కు 20,800గా ప్రకటించి..కేవలం 14 వేల నుంచి 16 వేల మధ్యనే వ్యాపారులు కొనుగోలు చేయడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. వ్యాపా రులతో అదనపు కలెక్టర్, మార్కెట్ శాఖ అధికారులు కొద్దిసేపట్లో చర్చలు జరపనున్నారు.
ఖమ్మం మార్కెట్‌లో అన్నదాతల ఆందోళన
0
210
Previous article
Next article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


