హైదరాబాద్: ఆధ్యాత్మిక విశ్వ గురువులు, సైంటిఫిక్ సెయింట్, ప్రాక్టికల్ ఫిలాసఫర్ శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీసులతో స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ఏడాది కాలంగా సేవలు అందిస్తున్నది. ఈ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 24వ తేది, శనివారం నాడు హైదరాబాద్ చంపాపేట్‌లోని సామ సరస్వతి గార్డెన్స్ జరుపుకుంటున్నారు. ఈ వేడుకలకు హైకోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వర రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమ వివరాల్ని స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ వెల్లడించింది. శనివారం ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఉదయం 9గంటల నుంచి ట్రస్ట్ కార్యాలయంలో గురుపూజ, 108 సార్లు మూల మంత్రోచ్ఛారణ చేపడతారు. సాయంత్రం 3.30 గంటల నుంచి 5గంటలవరకు చంపాపేటలో విశ్వ చైతన్య రథయాత్ర ఏర్పాటైంది. సాయంత్రం. 5.45 గంటల నుంచి 8.30గంటల వరకు ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై, వేడుకలను దిగ్విజయం చేయాలని స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ఆహ్వానిస్తోంది.
స్పూర్తి కుటుంబం.. తెలంగాణ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలు
0
409
Latest Articles
మమతా బెనర్జీ, టీఎంసీని వీడేది లేదు.. శతృఘ్న సిన్హా
ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు.. ఆ తర్వాత మమతా బెనర్జీ( Mamata Banerjee) పట్ల తన విధేయతను ప్రకటించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా(Shatrughan Sinha).తాను తృణమూల్...
- Advertisement -
- Advertisement -


