దసరా పండుగ ఏ రోజు జరుపుకోవాలి.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: దసరా పండుగ ఏ రోజు జరుపుకోవాలి…అని ప్రశ్న అందరిలోనూ ఇప్పుడు నెలకొంది. అయితే ఈ విషయం పై క్లారిటీ వచ్చింది. దసరా పండుగ ఈ నెల 23న ఉంటుందని తెలంగాణ ప్రకటించింది. రాష్ట్ర ప్రజలందరూ 23న విజయదశమి జరుపుకోవాలని సూచించింది. 100 మంది సిద్ధాంతులు ధర్మశాస్త్రానుసారం చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఈ నిర్ణయాన్ని శృంగేరి జగద్గురువులు, కంచి కామకోటి పీఠాధిశ్వరులు, పుష్పగిరి పీఠం, గురుమదనానంద పీఠం పీఠాధిశ్వరులు ఆమోదించారంది.
కాగా, పలు క్యాలెండర్లలో ఈ నెల 24న దసరా అని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, ప్రభుత్వ స్కూళ్లలో దసరా నాటికి ప్రారంభించాల్సిన సీఎం అల్పాహార పథకాన్ని ఈ నెల 6న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ఉండటంతో 6 నుంచి జిల్లాకు ఒక స్కూలులో పథకం అమలు చేసి పరిశీలించనుంది. అక్టోబర్ 26న స్కూల్లు పునః ప్రారంభం కానుండగా… లోపాలను సరిచేసి అన్ని పాఠశాలలకు విస్తరించాలని భావిస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Latest Articles

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్