చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. ఓవైపు ఆయన కుటుంబ సభ్యులు, మరోవైపు టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగుతున్నారు. బాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు ఇప్పటికే బెయిల్ క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాబుకు బెయిల్ పిటిషన్ నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక.. స్కిల్ డెవలప్​మెంట్ కేసులో తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. గవర్నర్‌ ముందస్తు అనుమతి లేకుండానే తనపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానంలో చంద్రబాబు పిటిషన్‌ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులోని 6వ నెంబర్‌ కోర్టులో ఐటెం నెంబర్ 63 కింద లిస్టయిన ఈ కేసును ఇవాళ జ్సిటస్ అనిరుద్దబోస్‌, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్