ఇంత అరాచకమైన పాలన ఎప్పుడూ చూడలేదు- చంద్రబాబు

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఇన్చార్జిలు, క్లస్టర్‌లతో కాకినాడ జోన్ -2 సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ .. బాదుడే బాదుడు’ కార్యక్రమంతోనే వైసీపీ పతనం ఆరంభమైందన్నారు. ఇదేం ఖర్మరా బాబుతో టీడీపీ బలంగా పుంజుకొందని చెప్పారు. భవిష్యత్తుకు భరోసా అనే కార్యక్రమంతో జనానికి మంచి భరోసా ఇస్తున్నామని తెలిపారు. దీంతో జనంలో టీడీపీకి మంచి క్రేజ్ వచ్చిందని చంద్రబాబు చెప్పారు.

రాజకీయాల్లో 45 సంవత్సరాలు నుంచి ఉంటున్నానని, ఇంత అరాచకమైన పాలన ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్ఠిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలతో ప్రజలు అల్లాడి పోతుంటే సైకో ముఖ్యమంత్రి అసలు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రహదారులు లేక రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతుంటుంటే సైకో ముఖ్యమంత్రి వాటిని చూసి పైశాసిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మళ్లీ చూడలేమని ఎద్దేవా చేశారు. గత శాసన మండలి ఎన్నికల నాటి నుంచి నేటి సర్పంచి ఎన్నికల దాకా టీడీపీ అభ్యర్దులే విజయకేతనం ఎగురవేస్తున్నారంటే భవిష్యత్తులో టీడీపీ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్దం చేసుకోవచ్చని చంద్రబాబు తెలిపారు.

Latest Articles

అమెరికాలో హెలికాప్టర్‌ ప్రమాదంలో భారతీయ సంతతి యువకుడు మృతి.. పెళ్లైన కొన్ని గంటలకే

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారతీయ మూలాలున్న ఓ యువకుడు వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే దుర్మరణం చెందాడు. కేరళకు చెందిన కుటుంబ నేపథ్యం కలిగిన 26 ఏళ్ల డేవ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్