TTD : చిరుత భయం.. నడకమార్గంలో తగ్గిన భక్తుల సంఖ్య..!

స్వతంత్ర వెబ్ డెస్క్: నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే అలిపిరి నడకమార్గం నిర్మానుష్యంగా కనిపించింది. తిరుమలలో వన్యప్రాణుల సంచారం‌తో అలిపిరి నడక మార్గం ఖాళీగా మారింది. నడక మార్గంలో చిరుతపులి (వన్య ప్రాణుల) సంచారంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిరుత(Leopard) లాంటి వన్య ప్రాణుల సంచారం అదుపులోకి వచ్చేంత వరకూ ప్రతి భక్తుడికి చేతికర్ర అందించేందుకు హైలెవెల్ కమీటీ‌ నిర్ణయం తీసుకుంది.

అలిపిరి(Alipiri) నడకమార్గంలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 వరకే తల్లిదండ్రులతో పిల్లలకు అనుమతిని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 తరువాత అనుమతించడం లేదని చెప్పారు. అయితే తిరుమలలో చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్ల మార్గంలో నిర్మానుష్యంగా మారింది.

నిత్యం గోవింద నామ స్మరణతో కిటకిటలాడే అలిపిరి నడకమార్గం, మెట్ల మార్గాల్లో భక్తుల తాకిడి చాలా తగ్గింది. వన్య ప్రాణుల సంచారం ఉన్నందున నడక మార్గంలో వెళ్లే భక్తులకు ఊతకర్ర ఇవ్వాలని టీటీడీ(TTD) నిర్ణయం తీసుకుంది. ఒకేసారి దాదాపు 100 మంది భక్తులకు గుంపులుగా నడకమార్గంలో పంపిస్తున్నారు. అదే విధంగా భక్తుల భద్రతకు నైపుణ్యం ఉన్న ఫారెస్ట్ సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోనుంది.. నడక మార్గంలోని దుకాణదారుకు వ్యర్ధాలను బయటకు వేయకుండా ఉంచితే చర్యలు తీసుకోవడంతో పాటుగా, అలిపిరి, గాలిగోపురం(Galogopuram), 7వ మైలురాయి దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయనుంది.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్