బోనాల నిర్వహణకు రూ.15 కోట్లు..

స్వతంత్ర వెబ్ డెస్క్: భాగ్యనగరంలో ఆషాడ బోనాల సందడి జూన్ 22నుంచి మొదలు కానుంది. గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలి బోనంతో ఈ నెల రోజుల ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీకుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఆషాడ బోనాల జాతర వచ్చేనెల 22న ప్రారంభం కానుందని, నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలి బోనంతో ఉత్సవాలు మొదలు కాగా, జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, జూలై 10న రంగం.. ఆధ్వర్యంలో ఊరేగింపు ఉంటుందన్నారు. జూలై 16న పాతబస్తీ బోనాలు, జూలై 17న ఉమ్మడి దేవాలయాలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకే బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు.

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్