స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఎరువుల ధరలు పెంచకూడదని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. యూరియాకు 70 వేల కోట్లు, డీఏపీకి 38 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవియా స్పందిస్తూ… సకాలంలో ఎరువులు అందించడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు వాటి భారం రైతులపై పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ సబ్సిడీ వల్ల దాదాపు 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
రైతులకు శుభవార్త.. ఎరువుల ధరలు పెంచకూడదని కేంద్రం నిర్ణయం
0
281
Previous article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


