స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించనున్నారు. ఇవాళ రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలులో బయల్దేరి రేపు ఉదయం 4.15కు కొత్తగూడెం చేరుకుంటారు. అక్కడినుండి 4.50కి బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథిగృహానికి చేరుకుంటారు. అక్కడ అల్పాహారం సేవించి రోడ్డు మార్గంలో ఉదయం 8.40 గంటలకు భద్రాచలం రామయ్యను దర్శించుకుంటారు. 9.10కు వీరభద్ర ఫంక్షన్ హాలులో ‘గిరిజనుల ఆరోగ్యం’పై అవగాహన సదస్సుకు హాజరవుతారు. ఉదయం 11- 12 గంటల వరకు రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొని మరలా ఐటీసీ అతిథిగృహానికి చేరుకుంటారు. అక్కడ భోజనం చేసి మధ్యాహ్నం 1.20 గంటలకు ఇల్లెందు లోని గెస్ట్ హౌస్ కి వచ్చి అక్కడినుండి 2.30కు ఖమ్మం ఎన్నెస్పీ అతిథిగృహానికి చేరుకుంటారు. ఖమ్మంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో రైలెక్కి రాత్రి 10.35కి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
ఉమ్మడి ఖమ్మంలో రేపు గవర్నర్ తమిళిసై పర్యటన
0
512
Previous article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


