స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ పర్యటించనున్నరు. విజయవాడలో శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం అనంతరం అక్కడినుండి బయల్దేరి తాడేపల్లి హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడినుండి నేరుగా కావలికి బయల్దేరుతారు. రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు లభ్ది చేకూరే విధంగా దాదాపు రూ. 20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కు పట్టాలు అందించే కార్యక్రమాన్ని కావలిలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొననున్నారు. దీంతో జిల్లాలో 18 వేల మంది రైతులకు 43 వేల 270 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కు వస్తుంది. అనంతరం మినీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.
కావలిలో సీఎం జగన్ పర్యటన.. చుక్కల భూములకు హక్కు పట్టాలు పంపిణీ
0
450
Previous article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


