పశ్చిమబెంగాల్ సందేశ్ ఖలీలో హింసాకాండ

     పశ్చిమ బెంగాల్ లో హింసాకాండ జరిగిన 24 పరగణాల జిల్లాలోని సందేశ్ ఖలీని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్శన్ రేఖా శర్మ సందర్శిస్తున్నారు. రెండురోజుల పర్యటనకు రేఖా శర్మ ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. సందేశ్ ఖలిలో మహిళలను లైంగికంగా వేధించారని, ఆరోపణలు రావడంతో అక్కడ పర్యటిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీని, డీజీపీని కూడా జాతీయ మహిళా కమిషన్ చీఫ్ కలిసి అక్కడి ఘటనలపై ఆరా తీస్తారు. సందేశ్ ఖలిలో హింసాకాండ కేసుకు సంబంధించి కీలక నిందితుడు షిబు ప్రసాద్ హజ్రాను అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టు అతడిని పోలీసు కస్టడీకి పంపింది. కాగా సందేశ్ ఖలిలో మహిళలపై లైంగిక దాడికి సంబంధించి దర్యాప్తును పశ్చిమ బెంగాల్ వెలుపల బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. హింసాకాండ బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన రాష్ట్ర పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది అలఖ్ అలోక్ శ్రీవాస్తవ తన వ్యక్తిగత హోదాలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్