విశాఖలో ఒక దళిత బాలికపై పది మంది లైంగికదాడి చేశారు. ఆ మానవ మృగాల చేతిలో బాలిక నరకాన్ని చవిచూ సింది. పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి ఇంటి పనుల కోసం వచ్చిన 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో వంచించి ప్రియుడు అత్యాచారం జరిపాడు. తన మిత్రుడినీ ఉసిగొలిపాడు. అక్కడి నుంచి తప్పించుకొని బీచ్‌కి వెళ్లిన బాలికను ఓ ఫొటోగ్రా ఫర్ ట్రాప్ చేశాడు. తన వెంట తీసుకెళ్లి.. మరో ఎనిమిది మందితో కలిసి రెండు రోజులు లాడ్జిలో చిత్రహింసలకు పెట్టి లైంగికదాడికి పాల్పడ్డారు.
ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన ఓ కుటుంబం విశాఖ కంచరపాలెంలో నివసిస్తోంది. ఆ కుటుంబంలోని బాలిక కు భువనేశ్వర్‌కు చెందిన యువకుడితో పరిచయం ప్రేమగా మారింది.ఈ నెల 18న ఆమెను ప్రియుడు హోటల్‌కు తీసు కెళ్లి అత్యాచారం చేశాడు. తన స్నేహితుడితో కూడా అఘాయిత్యం చేయించాడు.మనస్తాపానికి గురైన బాలికఆత్మహ త్య చేసుకుకేందుకు ఆర్కే బీచ్‌కు వెళ్లి రోదిస్తోంది. పర్యాటకుల ఫొటోగ్రాఫర్ ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లి, తాను, ఎనిమి ది మంది రెండు రోజులు లైంగికదాడి చేశారు.
వారి చెర నుంచి తప్పించుకున్న బాలిక సొంతూరు వెళ్లిపోయింది. బాలిక ఇంటి నుండి వెళ్లిన రోజే అదృశ్యం కేసు నమోదు చేసిన నాల్గో పట్టణ పోలీసులు 22న ఆమెను గుర్తించి, విశాఖ తీసుకొచ్చారు. బాలికపై లైంగికదాడి చేసిన పది మందిని పోలీసులు గుర్తించారు.