సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన …అభివృద్ధి పనులకు శంకుస్థాపన

   సీఎం రేవంత్​ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్​రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఇవాల పర్యటించనున్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకు స్థాపన చేయనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్​ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం కొడంగల్​ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. రూ.2,945 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
        కొండగల్‌లో సుమారు రూ.3,961 కోట్లకు పైగా పనులకు సీఎం రేవంత్​ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొనను న్నారు. తొలిసారిగా సీఎం రేవంత్​ కొడంగల్​ రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సైతం బహిరంగ సభకు వేలాదిగా హాజరుకానున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 31 వేల 849 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి పట్నం నరేందర్​రెడ్డిపై రేవంత్​ రెడ్డి గెలిచారు. అనంతరం రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇప్పుడు అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తుండడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్య టించాల్సి ఉన్నా, కొన్ని అత్యవసర కారణాలతో రెండుసార్లు పర్యటనను వాయిదా వేస్తూ వచ్చారు. రాష్ట్రా నికి నిధులు, లోక్​సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖరారు వంటి విషయాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్​ పర్యటన ముగిసింది. ఈ రోజు సొంత నియోజవకర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్