స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ సెప్టెంబరు 29న విజయవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా… వైఎస్సార్ వాహనమిత్ర 5వ విడత నిధులు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం నగరంలోని విద్యాధరపురం స్టేడియంలో జరగనుంది. రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్ లు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న వారికి జగన్ ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు వాహనమిత్ర పథకంలో భాగంగా నాలుగు పర్యాయాలు నిధులు విడుదల చేశారు. కాగా, రేపటి పర్యటన కోసం సీఎం జగన్ ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్నారు. విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు. సభ ముగిసిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
రేపు వైఎస్సార్ వాహనమిత్ర ఐదో విడత నిధుల విడుదల
0
317
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


