వైసీపీ నాయకులు పూర్తిగా వాలంటీర్లపైనే ఆధారపడ్డారు – ఉండవల్లి

ప్రజలు, ప్రభుత్వం మధ్య ఉండాల్సింది వాలంటీర్లు కాదని పార్టీ ఉండాలని తేల్చి చెప్పారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌. వైసీపీ నాయకులు పూర్తిగా వాలంటీర్లపైనే ఆధారపడ్డారన్నారు. చంద్రబాబు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇవ్వడంతో వారు టీడీపీకి ఓట్లేశారన్నారు. చంద్రబాబు వాలంటీర్లకు 10వేలు గౌరవ వేతనం ప్రకటించడంతో వారు టీడీపీ కోసం పని చేశారన్నారు. వైసీపీ పతనమైపోయింది అనుకుంటే అది టీడీపీ పొరపాటవుతుందన్నారు. ఈ ఐదేళ్లలో పార్టీ నిర్మాణం జరగాలని, అధికార ప్రతినిధులను నియమించుకుని వారికి ఎలా మాట్లాడాలో నేర్పించాలని సూచిం చారు. ఆంధ్రప్రదేశ్‌ ఫలితాలతోనే కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌. చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు ఇది సువర్ణావకాశమన్నారు. ఏపీ ప్రయోజ నాల కోసం కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు పని చేయాలని సూచించారు.

Latest Articles

ఈటల ఫ్లెక్సీ రచ్చపై స్పందించిన రామచందర్‌రావు.. కొందరు కుట్రలు చేశారు

ఈటెల రాజేందర్ మీద వచ్చిన అభియోగాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామ్ చందర్ రావు స్పందించారు. ఈటెల ఏడుపు బీజేపీకి శాపం అంటూ హైదరాబాద్ లో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. బ్యానర్లు, పోస్టర్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్