స్వతంత్ర, వెబ్ డెస్క్: ఎప్పటికప్పుడు తన మాటలనే సెన్సేషన్ డైలాగ్ గా మారుస్తూ.. నిత్యం ప్రజలతో మమేకమయ్యే మంత్రి మల్లారెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్ లో మాయమాటలు విని బిజెపిని గెలిపించుకొన్నారు.. కానీ వచ్చే ఎన్నికలలో నిజామాబాద్ ఎంపీగా కవితను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అందరూ ఆనందంగా ఉన్నారన్న మంత్రి.. దేశంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి తెలంగాణలో ఉందన్నారు.
బిజెపి అధికారంలో ఉన్న 17 రాష్ట్రాలలో తెలంగాణ లాంటి అభివృద్ధి ఎక్కడా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో దళిత బంధు, 24 గంటల విద్యుత్, గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనేలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికలలో అధికారం కైవసం చేసుకుంటానని పగటి కలలు కంటున్నాడని సెటైర్లు వేశారు. బిజెపి, కాంగ్రెస్ గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడిగితే చీపురులతో కొట్టాలని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో గెలిచే 10 మంది పేర్లను చెప్పమను ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు.