అన్నపూర్ణ స్టుడియోలో అన్‌స్టాపబుల్‌ షో..! -వీరమల్లుకు వీరసింహారెడ్డి స్వాగతం.!

  • ప్రారంభమైన మోస్ట్‌ అవైటెడ్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌

హైదరాబాద్‌: పవన్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, హీరో నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియో లో సందడి చేశారు. అన్‌ స్టాపబుల్‌ 2 షోకు పవన్‌కళ్యాణ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. ఇప్పటి వరకు ఒక లెక్కా..ఇక ఇప్పటినుంచి ఒక లెక్క అనేలా పవన్‌ కల్యాణ్‌ షోను ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా ఈ మోస్ట్‌ అవైటెడ్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ ప్రారంభమైంది.

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్‌ షో ఊహించిని స్థాయిలో రెస్పాన్స్‌ వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఛాట్‌ షోకు ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు వచ్చారు. బాలయ్యతో తమ జీవిత విశేషాలను పంచుకున్నారు. కాగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ మోస్ట్‌ అవైటెడ్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ తో జరిగే ఈ ఎపిసోడ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు నందమూరి, ఇటు మెగాస్టార్‌ ఫ్యా్స్ వేయికళ్లతో ఈ ఎపిసోడ్‌ కోసం వేచి చూస్తున్నారు.

ఈ అన్‌స్టాపబుల్‌ షోలో టాలీవుడ్‌లో మాస్‌ ఫాలోయింగ్‌లో ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఏం మాట్లాడుకుంటారు? షోలో బాలయ్య పవన్‌ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు? ఇద్దరూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి రాజకీయ అంశాలు చర్చకు వస్తాయా? అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. అలాగే బాలయ్య.. పవన్ కల్యాన్ మల్టీ స్టారర్ సినిమా పై కూడా ప్రశ్నలు సంధించే అవకాశముంది.

Latest Articles

మామిళ్ళపల్లి అంశాన్ని వైసీపీ నేతలు కుల రాజకీయంగా మారుస్తున్నారు- ధూళిపాళ్ల

గుంటూరు జిల్లా మామిళ్ళపల్లి అంశాన్ని వైసీపీ నేతలు కుల రాజకీయంగా మారుస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. అంబటి మురళి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల అధికారంలో వైసీపీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్