స్వతంత్ర వెబ్ డెస్క్: ఇంద్రకీలాద్రిపై కొలువైవున్న దుర్గమ్మ శ్రావణమాసం.. వరలక్ష్మి వ్రతం సందర్భంగా రేపు వరలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అంతేకాదు శ్రావణ శుక్రవారం ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రతం చేయడానికి ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష్మీదేవికి మహిళలు పూజలను చేయనున్నారు.
అమ్మాలనుకన్న అమ్మ దుర్గమ్మ శ్రావణమాసం.. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై భక్తులకు రేపు వరలక్మి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వరలక్ష్మి అంటే విష్ణుసతి అయిన లక్ష్మి దేవి అవతారం. శ్రావణమాసం రెండో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. ఈ రోజు అమ్మవారిని పూజించినా వరలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నా అష్టైశ్వర్యాలు సుఖసంపదలు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా మహిళలలు భక్తి శ్రద్దలతో నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో పిలల్లపాలతో సుఖసంతోషంగా ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
వరలక్ష్మి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దరిద్రం పోయి అమ్మవారి కృప కటాక్షం పొందుతారని భక్తుల నమ్మకం. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారు చతుర్భుజములు కలిగి ఉంటుంది. రెండు చేతులతో రెండు తామర పువ్వులతో పాటు అభయహస్తములు కలిగి ఉంటుంది. అమ్మవారు కూర్చున్న పీఠం వద్దే అక్షయపాత్ర కలశం ఉంటుంది. వరలక్మి వ్రతం రోజు వరలక్ష్మి దేవి రూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే లక్ష్మి కటాక్షం కలుగుతుందని నమ్మకం.. అందుకే దుర్గమ్మను దర్శించుకోవటానికి భక్తులు తండోప తండాలుగా తరలి వస్తారు. అలాగే నాలుగోవ శుక్రవారం ఉదయం 7 గంటల నుండే ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి పూజలు ప్రారంభం అవుతాయి.