హైదరాబాద్‌లో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్‌లో దారుణం జరిగింది. అడ్వకేట్ మొహినుద్దీన్‌ను కారుతో ఢీకొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన మొహినుద్దీన్.. తన కారు వద్దకు వెళ్లి డోర్ తీస్తుండగా వెనుక నుంచి మరో కారులో దుండగులు వేగంగా వచ్చి ఆయనను ఢీకొట్టి పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే లాయర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మొహినుద్దీన్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కారు ఢీకొట్టిన వెంటనే దుండగులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మాసబ్‌ట్యాంక్‌లో దారుణం.. లాయర్‌ను ఢీకొట్టిన కారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
0
44
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


