తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. 14 నెలల్లోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగిపోయిందన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. SLBC టన్నెల్‌లో 8మంది కార్మికులు చిక్కుకున్నా.. సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్నారు. నీరో చక్రవర్తి తరహాలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.
SLBC ఘటన జరిగి 72 గంటలు గడిచినా… ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని మాజీమంత్రి కేటీఆర్ విమర్శించారు. సుంకిశాల రిటైనింగ వాల్ కూలిపోతే బీజేపీ స్పందించలేదని నిలదీశారు. పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు చేసినా.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.