గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని.. కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి లోకేశ్ తెలిపారు. అయితే, 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రసంగంలో తప్పులు ఉంటే సరిదిద్దాలని.. అలా చేస్తే తప్పేం కాదన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రతి ఇవ్వాలని మండలి ఛైర్మన్ మోషేనురాజు కోరగా.. మంత్రి అనిత తీసుకెళ్లి ఇచ్చారు. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పట్లేదని.. పరిశ్రమలు వచ్చిన తర్వాత రెండు, మూడేళ్లలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని లోకేశ్ బదులిచ్చారు.