వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చురకలు అంటించారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్నారని ఆమె అన్నారు. ఆరు నెలలు అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుందని తెలిపారు. అందుకే జగన్ నిన్న అసెంబ్లీకి వెళ్లి అటెండెన్స్ వేయించుకుని వచ్చారని చెప్పారు. ప్రజలిచ్చిన బాధ్యతను జగన్ మర్చిపోవడం సరికాదన్నారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలను లేవనెత్తాలని సూచించారు. గత ప్రభుత్వంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చారని పురందేశ్వరి గుర్తు చేశారు.