అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్ సమీపంలో చెలరేగిన కార్చిచ్చు ఇప్పుడు భయానక రూపం దాల్చింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. 70 వేల మంది ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు వేలాది భవనాలు ఈ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాయి. నివేదిక ప్రకారం ఈ మంటలు మొదట పసిఫిక్ పాలిసాడ్స్, ఈటన్, హర్ట్స్ అడవులలో ప్రారంభమయ్యాయి. తరువాత అది నివాస ప్రాంతాలలో వ్యాపించాయి.
కాలిఫోర్నియా అడవి మంటలు చరిత్రలో అత్యంత ఖరీదైన అగ్నిగా అభివర్ణిస్తున్నారు. కార్చిచ్చుతో బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అత్యంత ఖరీదైన అగ్ని ప్రమాదం వల్ల లక్షలాది మందిప్రజలు ప్రభావితమయ్యారు. ఇప్పటికే 70 వేల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లగా… మంటలు అదుపులోకి రాకపోవడంతో మరో 50 వేల మందిని ఇళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వా ఆదేశాలిచ్చింది.
పసిఫిక్ పాలిసేడ్స్ అడవుల్లో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో కాలిఫోర్నియాలోని పసదేనా నగరంలో యూదుల ప్రార్థనా స్థలం దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదం కారణంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా దగ్ధమైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. హెలికాప్టర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 16 వేల ఎకరాలకు పైగా భూమి ప్రభావితమైంది.