హైదరాబాద్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు. సీఐఐ ప్రతినిధులతో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించిన సీఎం రేవంత్ వారికి స్కిల్ యూనివర్సిటీ విశేషాలను వివరించారు.. స్కిల్ యూనివర్సిటీలో భాగమవుతామని, విజన్ 2047లో పాల్గొంటామని, తెలంగాణ అభివృద్ధికి సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు సీఐఐ ప్రతినిధులు. ప్రతి ఏటా లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నా స్కిల్ ఉండటం లేదని, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యార్థులను తయారు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.