ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న రాజమండ్రి, అనకాపల్లి, 8న పీలేరు, విజయవాడ లో నిర్వహించే బహిరంగ సభలు, రోడ్ షోల్లో మోదీ పాల్గొననున్నారు. ఆయా సభలు, రోడ్ షోలకు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కూడా హాజరుకానున్నట్లు తెలిపారు. మే 6న సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5.55 గంటలకు అనకాపల్లి సభలో పాల్గొంటారు. మే 8న మధ్యాహ్నం 3 గంటలకు అన్నమయ్య జిల్లా పీలేరు సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సి పల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తారు మోదీ.
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు
0
393
Previous article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


