వింటేజ్ ప్రభాస్.. లుక్ అదుర్స్.. ‘రాజా సాబ్’ అప్డేట్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” నుంచి రెబల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇస్తున్నట్లు మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. “రాజా సాబ్” సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో “రాజా సాబ్” సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది.

“రాజా సాబ్” అప్డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. “రాజా సాబ్” సినిమాలో ప్రభాస్ లుక్, మేకోవర్ చాలా కొత్తగా ఉండబోతోంది. సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో దూసుకెళ్తున్న ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది. “రాజా సాబ్” సినిమా తమ సంస్థలో ఒక బెంచ్ మార్క్ మూవీగా మిగిలిపోయేలా నిర్మిస్తోంది.

“రాజా సాబ్” పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం “రాజా సాబ్” చిత్రీకరణ తుది దశలో ఉంది.

నటీనటులు – ప్రభాస్, నిధి అగర్వాల్,మాళవిక మోహనన్ తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని
మ్యూజిక్ – తమన్
ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
వీఎఎఫ్ఎక్స్ – ఆర్.సి. కమల్ కన్నన్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా(సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా
కో ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం – మారుతి

Latest Articles

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్