33.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

రోజుకో మలుపు తిరుగుతున్న మంచు ఫ్యామిలీ వివాదం

మంచు ఫ్యామిలీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మంచు మనోజ్‌ చెబుతుందంతా అబద్ధమంటూ ఆయన తల్లి నిర్మల లేఖ రాయడంతో ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్‌ ఏర్పడింది. ఇంట్లో విష్ణు ఎలాంటి గొడవ చేయలేదంటూ ఆమె వివరణ ఇచ్చారు. మోహన్‌బాబు కుటుంబ వివాదంపై తొలిసారి స్పందించారు ఆయన భార్య నిర్మల. మంచు మనోజ్‌ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు. ఈ విషయంపై పహాడీ షరీఫ్‌ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు. ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.

డిసెంబర్‌ 14న తన పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్‌పల్లిలోని ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్‌ చేశాడని చెప్పారామె. అయితే ఈ విషయంపై మంచు మనోజ్‌.. విష్ణు మీద అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసిందన్నారు. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదని ఆమె ఈ లేఖలో తెలిపారు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోయాడని చెప్పారు. ఈ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో.. పెద్ద కుమారుడు విష్ణుకీ అంతే హక్కు ఉందన్నారామె. తన పుట్టినరోజు నాడు విష్ణు మనుషులతో ఇంట్లోకి రాలేదని… మనోజ్‌ ఫిర్యాదులో నిజం లేదని చెప్పారు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు పని మానేయడంలో విష్ణు ప్రమేయం లేదని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు.

Latest Articles

కేటీఆర్‌లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్‌తో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్