స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మణిపూర్ లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో ఏపీ, తెలంగాణకు తరలిస్తున్నారు తెలుగు రాష్ట్రాల అధికారులు. ఇందులో భాగంగా తొలి విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. ఎయిర్ పోర్ట్ నుంచి వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ బయట 15 బస్సులను సిద్ధంగా ఉంచారు. ఏపీకి 7, తెలంగాణలోని పలు ప్రాంతాలకు 8 బస్సుల ద్వారా విద్యార్థులను తరలించనున్నారు. మరో విమానం ఇంపాల్ నుంచి కలకత్తా చేరుకొని అక్కడినుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ఈరోజు 100 మందిని ఇంఫాల్ నుంచి హైదరాబాద్ తరలించారు.