గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. నార్వే చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. 20 ఏళ్ల ఈ భారత చెస్ స్టార్ జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను ఓడించి చరిత్ర సృష్టించాడు. చివరి రోజు ప్రారంభానికి ముందు 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ప్రజ్ఞానంద కీలక సమయంలో అద్భుత ప్రతిభ కనబరిచి తన క్లాసికల్ గేమ్‌లో విజయం సాధించాడు. ఈ విజయంతో ప్రజ్ఞానందకు మూడు కీలక పాయింట్లు లభించగా.. మొత్తం 18 పాయింట్లకు చేరాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక చెస్ టోర్నమెంట్లలో ఒకటైన నార్వే చెస్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
ప్రజ్ఞానంద చరిత్రాత్మక ఘనత.. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
0
40
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


