భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ నగరంలో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది.
శనివారం సాయంత్రం 7 గంటల వరకు వర్షం పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్ మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలో తేలిక పాటి వర్షాలు పడతాయని తెలిపింది.
జూబ్లీహిల్స్‌లో భారీ వర్షపాతం నమోదైంది. బంజారాహిల్స్‌లో జోరుగా వర్షం కురుస్తోంది. ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో కూడా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో నగరవాసులకు ఉపశమనం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉంది. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.


